ETV Bharat / state

ప్రతీ రైతు.. వ్యాపారవేత్తలా ఆలోచించాలి: లక్ష్మీనారాయణ - interaction

మన రాష్ట్రంలో రైతులు కొబ్బరిబోండాన్ని అయిదు నుంచి ఆరు రూపాయలకు అమ్ముకుంటారు. అదే కేరళలో ఒక్క బోండంపై 2 వందల రూపాయలు సంపాదించగలరు. రైతులు ఆలోచనా ధోరణిని మార్చుకుని కలసికట్టుగా అడుగువేయాలి. ప్రతి రైతు ఓ వ్యాపారతవేత్తలా ఆలోచించాలి: వీవీ లక్ష్మీనారాయణ

వీవీ పలుకులు
author img

By

Published : May 17, 2019, 3:21 PM IST

వీవీ పలుకులు

యువతను వ్యవసాయరంగం వైపు మళ్లించి ఆ రంగాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యంతో తాను రైతులతో మమేకమవుతున్నట్లు జనసేన పార్టీ నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రు గ్రామాలలో జరిగిన రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు సాధించేందుకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు కొబ్బరి బోండాన్ని అయిదు నుంచి ఆరు రూపాయలకు అమ్ముతుంటే.. కేరళలో బోండం రెండు వందల యాభై రూపాయలు తెచ్చిపెడుతోందన్నారు. రైతులందరినీ కలపి ప్రొడ్యూసింగ్‌ కౌన్సిల్‌ అనే ఒక కంపెనీగా ఏర్పడి వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మూకుమ్మడిగా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఉత్పత్తులను ఆ కంపెనీయే కొనుగోలు చేస్తుందని వివరించారు. కంపెనీ తాను కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసి అమ్మటం ద్వారా లాభసాటి ధర పొందగలుగుతారని చెప్పారు. ఈవిధానాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరుజిల్లా బాపట్ల సమీపంలోని యాజిలి అనే గ్రామంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులు కూడా వ్యాపారధోరణిలో ఆలోచించాలని ఆయన సూచించారు. పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్యక్రమంలో వివరించారు.

Intro:ap_rjy_36_17_counting_arangments_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:ఓట్ల లెక్కింపు అధికారుల సన్నద్ధం

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు అధికారులు సన్నద్ధమయ్యారు ఈ నెల 23న కాకినాడ జే ఎన్ టి యు ఇంజనీరింగ్ విభాగంలో జరుగు ఓట్ల లెక్కింపు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ తరువాత ఈవీఎంలను ఓట్లను చివరగా వివి ప్యాడ్ స్లిప్పులు లెక్కించ వలసి ఉండడంతో అందుకు అవసరమైన పెట్టెలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిద్ధం చేశారు పోటీలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను గుర్తులను అతికించిన బాక్సులను అదేవిధంగా పార్లమెంటుకు పోటీలో ఉన్న అభ్యర్థుల యొక్క పేర్లు గుర్తుల గల బాక్సులను తయారు చేశారు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వ్యాలిడ్ ఇన్వాలిడ్ అను బాక్సులను సిద్ధంగా ఉంచారు వీటిని కాకినాడ కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్లనున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.