శివాపురం గ్రామంలో పంట పొలాల మధ్య చేపల చెరువులు తవ్వుతున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన మానవ హక్కుల కమిషన్… జిల్లా మత్స్యశాఖ, భూగర్భ శాఖ అధికారులు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని అధికారులు గురువారం శివాపురం గ్రామానికి చేరుకున్నారు. భీమవరానికి చెందిన కొందరు అనుమతులు లేకుండా చేపల చెరువులను తవ్వుతున్నట్లు గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు చేపతామని చెప్పారు.
ఇదీ చదవండి :