ETV Bharat / state

పుట్టింటి నుంచి డబ్బు తీసుకు రాలేదని.. భార్యను చంపిన భర్త - భార్యను నరికి చంపిన భర్త

పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో.. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావడం లేదనే కోపంతో భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

husband killed wife in west godavari duvva
భార్యను చంపిన భర్త
author img

By

Published : Jan 14, 2021, 6:20 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో దారుణం జరిగింది. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావడం లేదనే కోపంతో భార్యను భర్త నరికి చంపాడు. అనారోగ్యంతో పని నుంచి ఇంటికి తిరిగి వస్తున్న భార్య వరలక్ష్మిని దారిలో అడ్డుకున్న భర్త శ్రీనివాస్.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. మెడ మీద.. ఒంటిమీద.. విచక్షణా రహితంగా పొడిచాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పరారయ్యాడు. గాయాలతో కొంత దూరం పరిగెత్తుకెళ్లిన ఆమె రోడ్డుమీదే కుప్పకూలి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

మృతురాలు పచ్చల వరలక్ష్మి.. వయ్యేరు గట్టున ఉన్న కోళ్ల ఫారంలో పనిచేసేది. శ్రీనివాస్, వరలక్ష్మీల మధ్య డబ్బుల విషయంలో వివాదం జరిగింది. గతంలో 4 లక్షల రూపాయలను భర్తకు ఇచ్చింది. పుట్టింటి వారు ఇస్తానన్న మరో రూ.5 లక్షలు కూడా తీసుకురావాలంటూ శ్రీనివాస్ భార్యను వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తాళలేక సదరు మహిళ రెండు నెలల క్రితం జరిగిన గొడవతో.. భర్తకు దూరంగా పెద్దమ్మతో కలిసి వేరుగా ఉంటూ కోళ్ల ఫారంలో పని చేసుకునేది. చివరికి ఇలా.. భర్త చేతిలో హతమైంది.

ఇదీ చదవండి:

దారుణం: భార్యను కత్తితో నరికి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.