ETV Bharat / state

మద్యం మత్తులో దంపతుల మధ్య ఘర్షణ... భార్య మృతి - చింతలపూడిలో భార్యను హత్య చేసిన భర్త తాజా వార్తలు

మద్యం మత్తులో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్ఠణంలో మారుతీనగర్​లో జరిగింది. మృతురాలికి నలుగురు పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వారు తల్లి మృతదేహం వద్ద ఆడుకోవడం స్థానికులను కలచి వేసింది.

husband killed wife at chintalapudi
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Oct 19, 2020, 6:26 PM IST

Updated : Oct 19, 2020, 7:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని మారుతినగర్​లో మద్యం మత్తులో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఉత్తరప్రదేశ్​కు చెందిన రాజ్ కుమార్ తన భార్య ధారవతి, నలుగురు పిల్లలతో కలిసి మారుతీనగర్​లో గత కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. భర్త రాజ్ కుమార్ చింతలపూడి పరిసర ప్రాంతాల్లో సీలింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. ఆదివారం సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి భార్య మద్యం సేవించి ఉంది. అప్పటికే అతను కూడా మద్యం తాగి ఉండడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కోపంతో భార్యపై చేయి చేసుకున్నానని భర్త రాజ్ కుమార్ చెప్పాడు.

రాత్రి మద్యం మత్తులో నిద్రించిందని అనుకున్నానని, ఉదయం లేచేసరికి.. తన భార్య లేవకపోవడంతో మృతి చెందినట్లు తెలిపాడు. ఎలా చనిపోయిందో తనకు తెలియదని భర్త రాజ్ కుమార్ అంటున్నాడు. మద్యం మత్తులో కిందపడటంతో తలకు గాయమైనట్లు భావిస్తున్నట్టు చెప్పాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి పోలీసులు... హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

'అనుమతి లేని లే అవుట్లకు తక్షణం నోటీసులు'

Last Updated : Oct 19, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.