The longest road in the world : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి ఎక్కడ ఉందో మీరు ఊహించగలరా? మహా అయితే రెండు, మూడు వేల కిలోమీటర్లు లేదంటే పది వేల కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా వేసుంటారు. కానీ ఆ అతిపెద్ద హైవే పొడవు 30వేల కిలోమీటర్లు అంటే మీరు నమ్మగలరా? దాదాపు 14 దేశాల మీదుగా వెళ్లే రహదారిని పాన్-అమెరికన్ హైవే గా పిలుస్తారు. ఈ హైవే అలాస్కాలోని ప్రూడో బే నుంచి అర్జెంటీనాలోని ఉషుయా వరకు విస్తరించి ఉంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో విస్తరించిన ఈ రహదారిని 1889లో మొదట ప్రతిపాదించారు. ఈ రహదారిలో వివిధ వాతావరణాలు, ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. రహదారిపై డ్రైవ్ పూర్తి చేయడానికి నెలలు సమయం పడుతుందని అంచనా.
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
పాన్ అమెరికా రహదారి తర్వాత ఆస్ట్రేలియా హైవే ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. దాదాపు 14,500 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల మీదుగా, ఎడారులు, అడవులు, అందమైన బీచ్‌లను కలుపుకొని వెళ్తుంది. ఇక మనదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి 44వ నంబర్ రహదారి. ఇది జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ప్రారంభమై తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ వెళ్తుంది. దాదాపు 3,700 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మీదుగా వెళ్తుంది.
'తగ్గేదేలే'! - ఆ విషయంలో తెలంగాణను మించిపోయిన ఏపీ - దేశంలో నాలుగో స్థానం
పాన్ - అమెరికా రహదారి విషయానికొస్తే
పాన్-అమెరికన్ హైవే 14 దేశాల మీదుగా 19 వేల మైళ్లు లేదా దాదాపు 30,577 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. అలాస్కాలోని ప్రుధో బే సమీపంలో ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హొండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బొలీవియా దేశాల మీదుగా అర్జెంటీనాలోని ఉషుయా వద్ద ముగుస్తుంది.
దారి పొడవునా అందమైన ప్రదేశాలు, దట్టమైన అడవుల సమీపంలో అరుదైన జంతువులను చూడవచ్చు. దారి వెంట ఎక్కడా అడ్డంకులు, భారీ మలుపులు లేకున్నా పనామా - కొలంబియా మధ్య 160కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే "డేరియన్ గ్యాప్" అని పిలుస్తుంటారు.
రహదారి మీదుగా వెళ్తూ వివిధ సంస్కృతులు, ఆహారాలు, ఆహార్యాలు, భాషలను గమనించవచ్చు. ఆర్కిటిక్ టండ్రాస్, అమెజాన్ అడవి, అండీస్ పర్వతాలు వీక్షించే వీలుంది.
జంగిల్ సఫారీకే ఓటు - పులులు, సింహాలతో లైవ్ ఫొటో దిగొద్దామా!
మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?