ETV Bharat / state

తప్పుడు లెక్కలతో రూ.కోట్లు విలువైన ఆభరణాలు అపహరణ!

తప్పుడు లెక్కలు చూపించి రూ.2.50కోట్లు విలువైన ఆభరణాలను అహరించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది.

author img

By

Published : Apr 21, 2021, 1:47 AM IST

huge silver  Ornaments theft in narasapuram west godavari district
నరసాపురంలో దొంగతనం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని అంబికా సిల్వర్ ప్యాలెస్ యజమాని అశోక్ కుమార్ జైన్ విజయవాడలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార బాధ్యతలను తన వద్ద గుమస్తాగా పనిచేస్తున్న చాట్ల శివప్రసాద్​కు అప్పగించాడు. ఏడాది కాలంగా శివప్రసాద్ సుమారు 358 కిలోల వెండి ఆభరణాలను విక్రయించినట్లు తప్పుడు లెక్కలు చూపి వాటిని అపహరించినట్లు అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అపహరణకు గురైన ఆభరణాల విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇదీచదవండి.

'దిల్లీలో ఆక్సిజన్ కొరత.. కొన్ని గంటల్లో ఖాళీ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.