కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా..
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా(west godavari district) లో శైవ క్షేత్రాలు(lord shiva temple) శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజూము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకోని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తణుకు పట్టణంలో గోస్తని నదీ తీరాన వేంచేసి ఉన్న సిద్దేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి జల పాలాభిషేకాలు నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా..
పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం పురస్కరించుకోని తూర్పు గోదావరి జిల్లా(east godavari district) కోనసీమ ప్రాంతంలోని శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేశారు. పరమశివుడికి పంచామృతాలతో దివ్య అభిషేకాలు చేశారు. జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని కొలిచారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. మహిళలలు నదీమ తల్లికి దీపాలు సమర్పించారు. అనంతరం ఆలయాలను సందర్శించి పరమేశ్వరుడికి పూజలు చేశారు.
విశాఖ జిల్లా..
విశాఖ జిల్లా(visakha district) నర్సీపట్నం డివిజన్ పరిధిలోని ఆలయాలు ఆధ్యాత్మికతతో కళకళలాడుతున్నాయి. ప్రధానంగా రోలుగుంట మండలం బుచంపేటలోని మినీ కైలాసగిరి గిరి కొండ పై కార్తీక పూజలు నిర్వహించారు. ఇందుకోసం మహిళలు తెల్లవారుజామున నుంచి పుణ్య స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన శివపార్వతుల విగ్రహాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా..
కృష్ణా జిల్లా(krishna district) గుడివాడ పట్టణంలో పవిత్ర కార్తీక సోమవార పూజలు వైభవంగా జరిగాయి. భక్తుల శివ నామస్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. కార్తీకమాస మాసోత్సవాల రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని, తెల్లవారుజామున మూడు గంటల నుండి శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం,శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానాల్లో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించగా, వేదపండితులు విశేష అభిషేకాలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా..
పవిత్ర కార్తీక మాసం రెండో సోమవారం పురస్కరించుకోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జాము నుంచే ప్రధాన ఆలయాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి.
కర్నూలు జిల్లా..
కర్నూలు జిల్లా(kurnool district)లోని శ్రీశైల మహాక్షేత్రం.. భక్తుల రద్దీతో కళకళ లాడుతోంది. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు .. శ్రీశైలం తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తీక దీపాలు వదిలారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: