ఉగ్రరూపం దాల్చిన గోదావరితో ముంపు గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 55 ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోట, వేలేరుపాడు, వీర్లవరం గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు గ్రామాలు ఖాళీ చేస్తున్నారు.
వేలేరుపాడు మండలంలో 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో 5 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం మండలంలో 19 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. యలమంచిలి, ఆచంట మండలాల్లో 7 లంక గ్రామలు చుట్టూ వరద చేరింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాలు ఖాళీ చేసి ప్రజలు పునరావాస కేంద్రాలకు వస్తున్నారు. అక్కడ కూడా సరైన సదుపాయాలు ఉండటం లేదు.
ఇదీ చదవండి: ఎగువ నుంచి భారీగా వరద.. జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు