పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే అంశంలో భాగంగా అధికారులు షాపులన్నీ మూయించారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వైరస్ పట్ల ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి బంద్ అమలు చేస్తున్నట్లు తణుకు తహసీల్దార్ ప్రసాద్ వెల్లడించారు. పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలకు అధికారులు మినహాయింపు ఇచ్చారు. పట్టణ పరిసర గ్రామాల నుంచి అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారిని మాత్రమే అనుమతించారు. ఇందుకోసం పట్టణ నలుమూలల పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పహారా కాస్తున్నారు.
ఇవీ చూడండి...