ETV Bharat / state

హైదరాబాద్​లో ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు మృతి - గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఐదుగురు యువకులు మరణించారు. వారంతా కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకువచ్చిన కారు.. గచ్చిబౌలి విప్రో సర్కిల్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ను అతిక్రమించింది. ఈ క్రమంలో అటు నుంచి వచ్చిన టిప్పర్‌ కారును ఢీకొట్టింది. రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి.

four mens dead in gachibowli road accident in hyderabad
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 13, 2020, 10:21 AM IST

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించగా... మరొకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డికి వెళ్తున్న స్విఫ్ట్​ కారు సిగ్నల్​ జంప్​ చేసింది. అదే సమయంలో గ్రీన్​ సిగ్నల్​ పడి వస్తున్న టిప్పర్​.. ఆ కారును ఢీ కొట్టింది.

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

మృతుల్లో కాట్రగడ్డ సంతోష్ (25), చింతా మోహన్ (22), భరద్వాజ (20), రోషన్, పవన్ ఉన్నారు. వీరందరూ మెన్స్ హాస్టల్​లో ఉంటున్నారు. సంతోష్​ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం. కొల్లూరు పవన్‌కుమార్, నాగిశెట్టి రోషన్ నెల్లూరు చెందిన వారు కాగా పప్పు భరద్వాజ్ విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్ వాసి. చింతా మనోహర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. సంతోష్ టెక్​ మహీంద్రాలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి:

వర్షాలకు భారీగా దెబ్బతిన్న రోడ్లు.. నిధుల కొరతతో అరకొరగా మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.