ETV Bharat / state

దారుణం..! కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. - father raper her daughter in west godavari district

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలు తట్టుకోలేక బాలిక ఇంటి నుంచి ఏలూరుకు పారిపోయింది. అక్కడ మరో వ్యక్తి తాను పోలీసునంటూ పరిచయం చేసుకుని బాలికను తీసుకెళ్లి ఓ గదిలో ఉంచి అత్యాచారానికి యత్నించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై బాలికను తీసుకెళ్లి ఆమెను సొంత ఊర్లో దించాడు. జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

father-raped-her-daughter
కంటికి రెప్పలా కాపాడాల్సివాడే కామంధుడైతే...!
author img

By

Published : May 22, 2020, 12:05 PM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన బాలిక(14)పై కన్నతండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి వికృత చేష్టలు బరించలేక ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వచ్చి ఏలూరు వైపు వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనని తాను పోలీసుగా పరిచయం చేసుకుని... న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులో ఓ గదిలో ఉంచి ఆ మరుసటి రోజు తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పుడే అతను ఆమె తల్లికి ఈ విషయం చెప్పంది. అయితే తనను గదిలో ఉంచిన వ్యక్తి కూడా బలత్కారం చేయబోయాడని బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ పైడేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుస్టేషన్​లో తనపై కేసు నమోదైందని తెలుసుకున్న బాలిక తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి :

దారుణం... బాలికపై పదిహేను రోజుల నుంచి అత్యాచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.