పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో విద్యుదాఘాతంతో వెంకటేశ్వరరావు అనే రైతు మృతి చెందాడు. ఎడ్లను మేపడానికి పొలం వద్దకు వెళ్లగా.. అక్కడ విద్యుత్ తీగ తగిలి ఈ ప్రమాదం జరిగింది. తొలుత ఎద్దు విద్యుదాఘాతానికి గురైంది. దాన్ని రక్షించే ప్రయత్నంలో రైతు విద్యుదాఘాతానికి గురై వెంటకేశ్వరరావు మృతి చెందాడు. ఎద్దు సైతం ప్రాణాలు విడిచింది.
ఇదీ చదవండి: