కరోనా కాటుకు.. కుటుంబం కుదేలైంది. ఇంటి యజమానిని బలి తీసుకున్న వైరస్.. ఆ కుటుంబం మొత్తాన్ని కకావికలం చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం.. పసివేదలకు చెందిన నరసయ్య కుటుంబం.. వ్యవసాయంపై ఆధారపడి బతికేది. ఈ నెల 16న నరసయ్య కరోనాతో మరణించాడు. ఆ సమయంలో.. బంధువులు, సన్నిహితులు ఎవరూ వారిని కనీసం ఓదార్చలేదు. ఇంటి పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని.. ఈ పరిణామం మరింత కుంగదీసినట్టు తెలుస్తోంది.
భార్య, కుమార్తె, కుమారుడి ఆత్మహత్యాయత్నం
ఈ క్రమంలోనే.. నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణి కుమార్ (25), కుమార్తె (23).. మంగళవారం అర్థరాత్రి గోదావరిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ నుంచి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఇంటి పెద్ద మరణం అనంతరం తీవ్ర ఆవేదనకు, మనస్తాపానికి గురైన కారణంగానే ఈ ముగ్గురు బలవన్మరణానికి యత్నించి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు.
వరదలో గల్లంతు.. గాలింపునకు అంతరాయం
వరద తాకిడి అధికంగా ఉన్న కారణంగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: