Home Minister Vangalapudi Anitha Fire on Jagan : నక్క తెలివితేటలతో జగన్ మోహన్ రెడ్డి నాడు ఎమ్మెల్యేలను ఇటు నుంచే అటు లాగేశాడని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించాడని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలు ఇప్పించాడని మండిపడ్డారు. స్పీకర్ జోన్లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించాడని దుయ్యబట్టారు. అయినా సాకులు చెప్పలేదు, నాలుగు పక్కలా చుట్టుముట్టి కాలకేయుల్లా మీద పడే ఉన్మాద గుంపుల మధ్యలోకి ఒక్కడిగా చంద్రబాబు నాడు వచ్చారని అన్నారు.
నక్కతెలివితేటలతో ఎమ్మెల్యేలను ఇటు నుంచే అటు లాగేశావ్,బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావ్, ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలిప్పించావ్ , స్పీకర్ వైఫై జోన్ లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించావ్, అయినా సాకులు చెప్పలేదు, నాలుగు పక్కలా చుట్టుముట్టి… pic.twitter.com/smuaHNNoVv
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 11, 2024
ప్రజల తరపున ఒక్కడై గొంతు విప్పారని, ప్రజా గళం బలంగా వినిపించారని అనిత గుర్తు చేశారు. అరెస్ట్ అయినా మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారని కొనియాడారు. అదీ నిబద్ధత, అదీ ధైర్యం, అదీ సింహం సింగల్గా రావడం అంటే అని అన్నారు. వాచీలో మూడు మీద ముల్లాడటం లేదు, ఇంటి బయట బెల్ ఆడటం లేదు, లోపల గాలాడటం లేదు అని పిల్లాటలు ఆడడం కాదని ఎద్దేవా చేశారు. ఎవరు సింహమో, ఎవరు మేకవన్నెపులో వేరే చెప్పాలా, ఇంకా డౌట్లు ఉన్నాయా అంటూ జగన్కు అనిత సవాల్ చేశారు.
అసెంబ్లీ మీద అలగడానికి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు : షర్మిల
ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట