ETV KARTHIKA DEEPOTSAVAM: ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానెల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణా ఆధ్వర్యంలో నేడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కార్తిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. వెలగపూడి గ్రామ పరిధిలో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపజ్యోతులు, శివ అష్టోత్తరం, మహాదేవునికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. కురుక్షేత్రం తర్వాత ఏం జరిగింది? ద్వాపరయుగాంతం ఎలా జరిగింది? వంటి అంశాలపై బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనం ఉంటుంది. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతుంది.
Karthika Deepotsavam Program: కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు పేర్కొంటున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 గంటల నుంచి వెలగపూడి గ్రామ పరిధిలో కార్తిక దీపోత్సవం ఉచితంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక అంశాలపై బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనం ఉంటుంది.
జాగ్రత్తలు: ఈ కార్యక్రమానికి సంబంధించి పాసులు పొందిన వారు సాయంత్రం 5 గంటల లోపు మైదానానికి చేరుకోవాలి. వాలంటీర్లు సూచించిన ప్రాంతంలో కూర్చోవాలి. కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు నిర్వాహకులే పూజా సామాగ్రి సమకూరుస్తారు. మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పిల్లలకు అనుమతి లేదు. నేలపై కూర్చోగలిగే వారు మాత్రమే హాజరు కావాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
దీపారాధన కార్యక్రమం కాబట్టి సాధ్యమైనంత వరకూ కాటన్ దుస్తులు ధరిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. దీపోత్సవం కార్యక్రమం మొత్తం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణా, ఈటీవీ లైఫ్ ఛానళ్లలో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కార్యక్రమానికి రాలేకపోయిన వారు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చని తెలిపారు.
కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? కలిగే ఫలితమేంటి?
"15న కార్తిక పౌర్ణమి పర్వదినం - ఆ రోజున తప్పక చేయాల్సిన పూజలు ఇవే!"