Cell Phones Found in Visakhapatnam Central Jail: విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్లు దొరకడం కలకలం రేపింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ ఉన్న పెన్నా బ్యారక్ సమీపంలోని పూలకుండీ కింద 2 సెల్‌ఫోన్లను గుర్తించారు. పూలకుండీ కింద గొయ్యి తీసి రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌లు, బ్యాటరీలు దాచి ఉంచారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జైలు అధికారులు సోదాలు నిర్వహించగా సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. గంజాయి అక్రమ రవాణా ప్యాకింగ్ మాదిరిగానే ఫోన్లు ప్యాక్ చేసి పూలకుండీ కింద దాచారు.
CP Examined Cell Phones in Arilova PS: ఈ విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కమిషనర్ శంకబ్రత బాగ్చి (Commissioner Sankabrata Bagchi) స్వయంగా ఆరిలోవ పోలీసు స్టేషన్‌కు వచ్చి వాటిని పరిశీలించారు. సెల్‌ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. లోపలికి ఎలా తీసుకొచ్చారు, వీటిని ఎవరెవరు వినియోగించారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెల్‌ఫోన్ల ద్వారా బయట ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
రూ.600 ఇస్తేనే పింఛన్ - మహిళా అధికారి దౌర్జన్యం - కట్ చేస్తే