ETV Bharat / state

న్యూఇయర్ వేడుకలు - కేకులు, స్వీట్ల కోసం బారులు తీరిన జనం - NEW YEAR CELEBRATIONS 2025

మొదలైన నూతన సంవత్సర వేడుకలు - కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు

NEW_YEAR_CELEBRATIONS
NEW YEAR CELEBRATIONS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 8:38 PM IST

Updated : Dec 31, 2024, 10:57 PM IST

NEW YEAR CELEBRATIONS 2025: రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. మార్కెట్లలో నూతన సంవత్సరం సందడి నెలకొంది. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి అవసరమైన కేకులు, స్వీట్ల కోసం బేకరీల వద్ద బారులు తీరారు. ఇళ్లను అందంగా అలకరించుకోవడానికి అవసరమైన సామాగ్రితో పాటు ఇంటి ముందు ముగ్గులు వేయడానికి అవసరమైన రంగులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.

అధికారులు, ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పుష్ప గుచ్ఛాల షాపులకు అనేక మంది క్యూ కట్టారు. దీంతో పాటు కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకుని వస్త్ర దుకాణాలకు ప్రజలు వచ్చి వారికి కావాల్సిన బట్టలను కొనుగోలు చేశారు. దీంతో బెజవాడలోని ప్రధాన మార్కెట్లన్నీ కొనుగోలుదారుల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రాకపోకలు సాగించే వాళ్లు అధికంగా ఉండటంతో రోడ్లపై రద్దీ నెలకొంది.

NEW YEAR CELEBRATIONS
NEW YEAR CELEBRATIONS (ETV Bharat)

విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో కొత్త సంవత్సరం ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో చేరి కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన డప్పు కళాకారుల బృందం డప్పులు మోగిస్తూ హుషారెత్తించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. వీరి వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

NEW YEAR CELEBRATIONS
NEW YEAR CELEBRATIONS (ETV Bharat)

మందుబాబుల కోసం ప్రత్యేకంగా: నూతన సంవత్సరం ప్రారంభ సమయం అనగానే మందుబాబులకు ఎక్కడ లేనంత ఉత్సాహం వస్తుంది. వారిని ఆకర్షించేందుకు వ్యాపారులు పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. కాకినాడ జిల్లాలోని కేంద్ర బాలిక ప్రాంతం యానంలో మాంసాహారి ప్రియుల కొరకు కోళ్ల వ్యాపారులు ప్రత్యేక ధరలతో అమ్మకాలు చేపట్టారు. పర్యాటక శాఖకు చెందిన సీగల్స్ రెస్టారెంట్ తందూరి చికెన్ తయారీని ఓపెన్ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టింది.

మందుబాబుల కోసం మద్యం షాపులలో నాణ్యమైన అన్ని రకాల బ్రాండ్​ల మద్యాన్ని అందుబాటులో ఉంచారు. అదే విధంగా బేకరీ, స్వీట్ షాప్​ల యజమానులు 2025 సంవత్సరానికి స్వాగతం పలికేలా భిన్నమైన ఆకృతులలో కేకులను తయారుచేసి కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. కేకులతోపాటు పలు రకాల పిండి వంటలను సిద్ధం చేశారు.

NEW YEAR CELEBRATIONS
NEW YEAR CELEBRATIONS (ETV Bharat)

ఇవి అస్సలు చేయొద్దు: అన్నమయ్య జిల్లాలో పోలీసు నిబంధనలకు అనుసరించి ప్రజలు యువత నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలలో పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల తర్వాత డీజేలు పెట్టడం, పెద్ద శబ్దాలతో రోడ్లపై కేకలు వేయడం వంటివి చేయకూడదని అన్నారు. ఆ సమయానికి ముందు మైక్​లు పెట్టాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై వాహనాలలో పెద్ద శబ్దాలు చేస్తూ తిరుగుకూడదని ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో చిన్న యాక్సిడెంట్ కూడా జరగకూడదని, ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకుండా యువత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు

NEW YEAR CELEBRATIONS
NEW YEAR CELEBRATIONS (ETV Bharat)

'మన కోసం బతికేవాళ్లు ఉన్నారు - అవి అవసరమా డార్లింగ్స్' - ప్రభాస్ న్యూఇయర్ మేసేజ్

వరల్డ్​ వైడ్​గా న్యూ ఇయర్​ ఫీవర్ - మనకంటే ముందు ఆ దేశాల్లో 2025కు స్వాగతం!

కొత్త ఆశలు చిగురింపజేసే నూతన సంవత్సరం - 2025కు ఇలా స్వాగతం పలుకుదాం!

Last Updated : Dec 31, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.