పశ్చిమగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా నిర్వహించామో.. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసేలాగా కృషి చేయాలని ఎన్నికల పరిశీలకుడు లత్కర్ శ్రీకేశ్ బాలాజీ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదైందని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదు కావాలని కోరారు.
ఇదీ చదవండి: తునిలో రైలు దహనం కేసు విచారణ.. ఈ నెల 16కు వాయిదా