ETV Bharat / state

ప్రయాణికురాలు మరిచిపోతే.. ఆర్టీసీ సిబ్బంది తిరిగి అందించారు!

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మహిళ.. రూ. 23,500 ల నగదు సంచిని మరిచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ఆమె ఆచూకీ గుర్తించి.. డబ్బును అందజేశారు. మానవత్వాన్ని చాటుకున్నారు. తోటి ఉద్యోగులు, ప్రయాణికులు వారిని అభినందించారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్​లో జరిగింది.

money
మానవత్వం
author img

By

Published : Dec 21, 2020, 4:25 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన విజయలక్ష్మి... శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడేనికి తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. గమ్యస్థాన్నాన్ని చేరుకోవడంతో బస్​ దిగే క్రమంలో రూ.23,500 ల నగదు సంచిని బస్సులోనే మరిచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇంటికెళ్తున్న క్రమంలో ఆటోడ్రైవర్​కు డబ్బులిచ్చే సమయంలో.. డబ్బు సంచి మరిచిపోయిన విషయాన్ని గుర్తించారు.

వెంటనే.. తణుకు ఆర్టీసీ బస్టాండ్​కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అక్కడి నుంచి అప్పటికే బస్సు వెళ్లిపోయిందని అధికారులు చెప్పగా.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్​కు ఫోన్ చేసిన విజయలక్ష్మి.. విషయాన్ని తెలిపారు. అక్కడ డ్యూటీలో ఉన్న రాంబాబు, ముత్యాలరావు బస్సు వచ్చిన వెంటనే లోపలికెళ్లి పరిశీలించి నగదు సంచి గుర్తించారు. విజయలక్ష్మి రావులపాలెం బస్టాండ్​కు వెళ్లిన తర్వాత, ఆమె టికెట్​ను పరిశీలించిన డిపో మేనేజర్ నగదును అందించారు. రాంబాబు, ముత్యాలరావు ను తోటి ఉద్యోగస్తులు, ప్రయాణికులు అభినందించారు.

ఇదీ చదవండి:

పురాలకు సొమ్ములొచ్చాయ్‌.. తొలి విడతలో రూ.20.15 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.