పాఠశాల బస్సు నడుపుతూనే మద్యం సేవించిన ఓ డ్రైవర్... ప్రమాదానికి కారణమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. ఉంగుటూరు మండలం సీతారాంపురంలో జరిగిన ఈ ఘటనలో ఓ విద్యార్థి సహా డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన ప్రైవేట్ పాఠశాలకు.... ఉంగుటూరు మండలం నుంచి విద్యార్థులు బస్సులో బయలుదేరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న బస్సు డ్రైవర్ గ్రామం మలుపు వద్దకు రాగానే బస్సును అదుపు చేయలేకపోయాడు. ఈ క్రమంలో బస్సు పంట కాలువలోకి దూసుకుపోయింది. ఎనిమిదో తరగతి చదువుతున్న జానకిరామ్ రెడ్డి అనే విద్యార్థి, డ్రైవర్, మరోవ్యక్తి ప్రమాదంలో గాయపడగా... ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.
తాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్.. ముగ్గురికి గాయాలు - drive
పాఠశాల బస్సు నడుపుతూనే డ్రైవర్ మద్యం సేవించాడు. మలుపులో బస్సును అదుపు చేయలేకపోయాడు. నియంత్రణ కోల్పోయి పంట కాలువలోకి దూసుకుపోయింది బస్సు. విద్యార్థితో సహా డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.