స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో(శాప్ SAAP).. పశ్చిమగోదావరి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. తణుకు మహిళా కళాశాలలోని.. పుల్లెల గోపీచంద్, సుబ్బారావు బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో మూడు రోజుల పాటు జరిగే పోటీలను.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. పోటీల ప్రారంభం అనంతరం.. ఎమ్మెల్యే కాసేపు బ్యాడ్మింటన్ ఆడి.. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. విద్యార్థులు కేవలం విద్యా రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
శాప్ అంటే తెలియని పరిస్థితి నుంచి.. ఆ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిభావంతులను వెలికితీయడానికి కోచ్ లు కృషి చేయాలని కోరారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.
ఇదీ చదవండి:
మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్... ఆ తర్వాత పరిస్థితి చూస్తే..