తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసియున్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కున వజ్రాల ముక్కెరతో, శిరస్సున కిరీటం, మెడలోని హారాలతో స్వర్ణ శోభితమైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భక్తులు దర్శనం చేసుకోవడానికి దేవస్థానం పాలక మండలి, అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించారు.
ఇదీ చదవండి :