కొవిడ్ కేసులు పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వెంకన్నబాబు, పద్మావతి అనే దంపతులు నిరసన దీక్షకు దిగారు. వారుంటున్న పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో ఆందోళన చేపట్టారు. పాలుకొల్లుతోపాటు..తాము ఉంటున్న ప్రాంతంలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదైనా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లలేదని వారు వాపోయారు. ఒకే కాలనీలో 19పాజిటివ్ కేసులు నమోదైనా పురపాలక సంఘం అధికారులు ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారుల అలసత్వం వల్ల కొవిడ్ కేసులు అధికమవుతున్నాయని... అందుకే నిరసన దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదని దంపతుల ఆందోళన - పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ దంపతుల ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వెంకన్నబాబు, పద్మావతి అనే దంపతులు నిరసన దీక్షకు దిగారు. పురపాలక సంఘం పరిధిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ ఆరోపించారు.