పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మురుగు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరంలో ఓ వ్యక్తి గత వారం రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా...పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో ఏం చేయాలో తెలియక భయాందోళన చెందాడు. కుటుంబసభ్యులు ఏమై పోతారోనని ఆందోళన చెందాడు. ఆ కంగారుతో యనమదుర్రు మురుగు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: