పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక పనులను అధికారులు ప్రారంభించారు. గ్యాప్ వన్ డయా ఫ్రంవాల్ నిర్మాణ పనులకు పూజలు నిర్వహించారు. 450 మీటర్లు నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రధాన డ్యాంలో ఇదీ కీలక మైనదని తెలిపారు. ప్లాస్టిక్ కాంక్రిట్ డయా ఫ్రంమ్ వాల్ లో మొత్తం 89 ప్యానెల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పూజ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నాగిరెడ్డి, మెగా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'