ETV Bharat / state

ఇరు వర్గాల మధ్య ఘర్షణ... పి.అంకంపాలెంలో ఉద్రిక్తత - రెండు వర్గాల మధ్య ఘర్షణ

పిల్లల విషయంలో గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసు స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

పి. అంకంపాలెంలో ఉద్రిక్తత
పి. అంకంపాలెంలో ఉద్రిక్తత
author img

By

Published : Jan 1, 2021, 10:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిల్లల విషయంలో గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బెల్లంకొండ జయలక్ష్మి ఇంటిపై అదే గ్రామానికి చెందిన కట్టురి కిషోర్ చిన్న పిల్లల తగాదా విషయంలో దాడి చేశాడు. స్థానికులు వారించగా అతను ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి ఒంటిగంటకు కట్టూరు అశోక్, హైదరాబాద్​ శ్రీను అనే వ్యక్తులతో కలిసి మరోసారి దాడి చేయటానికి వచ్చాడు. పక్కింట్లో ఉండే వెంకాయమ్మ నాగేశ్వర రావు కుటుంబీకులు గమనించి అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో ముగ్గురు యువకులను స్తంభానికి కట్టేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని విడిపించారు. అనంతరం రెండు వర్గాలు జీలుగుమిల్లి పీఎస్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి

కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.