ETV Bharat / state

ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణం..! - ఏలూరు వార్తలు

పురుగు మందుల అవశేషాలే ఏలూరులో వింత వ్యాధికి కారణమని ఎయిమ్స్, ఐ​​ఐసీటీ ప్రఖ్యాత సంస్థలు తేల్చాయి. పురుగు మందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ప్రవేశించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. మనుషుల్లోకి ఎలా వచ్చాయో అధ్యయనం చేయాలని సీఎం జగన్ నిపుణులను ఆదేశించారు. అధ్యయన బాధ్యతను దిల్లీ ఎయిమ్స్‌, ఐఐసీటీకి సీఎం అప్పగించారు. ఏలూరు ఘటన దృష్ట్యా ప్రతి జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏలూరు వింత వ్యాధి
ఏలూరు వింత వ్యాధి
author img

By

Published : Dec 16, 2020, 6:07 PM IST

Updated : Dec 16, 2020, 8:28 PM IST

పురుగు మందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని అధ్యయనం చేసిన నిపుణులు తేల్చారు. ఈ విషయాన్ని దిల్లీ ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు ధ్రువీకరిస్తూ తాము జరిపిన పరిశోధన ఫలితాలను సీఎం వైఎస్ జగన్​కు నివేదించాయి. ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్‌ ముత్యాలరాజు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, జలవనరుల శాఖ , వ్యవసాయశాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌ఐఎన్, ఎన్​ఐసీటీ, ఎయిమ్స్‌- దిల్లీ, ఎయిమ్స్‌- మంగళగిరి, సీసీఎంబీ, నీరి–హైదరాబాద్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రతినిధులు తమ పరిశోధన వివరాలను తెలిపారు.

సీఎం జగన్ సమీక్ష
సీఎం జగన్ సమీక్ష
  • రోగుల రక్తంలో లెడ్---దిల్లీ ఎయిమ్స్

అస్వస్థతకు గురైన వారి రక్తంలో లెడ్‌ కనిపించిందని నిపుణులు తేల్చారు. అలాగే పాలకు సంబంధించి అన్ని శాంపిల్స్‌లో నికెల్‌ కనిపించిందని దిల్లీ ఎయిమ్స్‌ నివేదించింది. రోగులను పరిశీలిస్తే ఆర్గానో క్లోరిన్‌ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. బహుశా పురుగు మందులు కారణంగానే ఇది వచ్చి ఉండొచ్చని తెలిపారు. ఆహార సైకిల్‌లో భాగంగా అది శరీరంలో చేరే అవకాశం ఉందని తెలిపారు. అస్వస్థతకు గురైన వారితో పాటు, వారి బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్‌ కనిపించిందని తెలిపారు. దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన వైనంపై కచ్చితమైన కారణం కనుక్కునే అవకాశం ఉందన్నారు.

  • రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ--ఐఐసీటీ

మనుషులు, పశువుల నుంచి సేకరించిన రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయని హైదరాబాద్​లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సంస్థ నిపుణులు తెలిపారు. కొన్ని రక్తపు నమూనాల్లో లెడ్‌ కనిపించిందని, ఆర్గనో ఫాస్పేట్స్‌ కనిపించలేదన్నారు. తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భారీ లోహాలు కనిపించలేదన్నారు. లెడ్‌ కాని, ఆర్సెనిక్‌ కాని, నికెల్‌ తరహా లోహాలు కాని లేవన్నారు. తాగునీరు పరిశుభ్రంగానే ఉందన్నారు. ఏలూరులో గాలి కూడా సాధారణ స్థాయిలోనే ఉందని వెల్లడించారు. భూగర్భ జలాల శాంపిళ్లపై పరిశీలన జరిపినట్లు నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఈఈఆర్‌ఐ) హైదరాబాద్‌ తెలిపింది. ఉపరితల జలాల్లో కూడా అన్ని పరిమిత స్థాయిలోనే ఉన్నాయని, మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉందని వెల్లడించింది. ఆర్గానో క్లోరిన్‌ కాని, ఆర్గానో ఫాస్పేట్స్‌, లెడ్‌ కాని కనిపించలేదని నిపుణులు తెలిపారు.

కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు

  • కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు--ఎన్​ఐఎన్​

మట్టి నమూనాలపై విశ్లేషణ, పరీక్షలు జరుగుతున్నాయని సంస్థలు వెల్లడించాయి. వ్యర్థ పదార్ధాలు కాల్చడం వల్ల కూడా ఇది జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఉపరితల జలంతో పోలిస్తూ భూగర్భ జలాల్లో పాదరసం ఎక్కువ స్థాయిలో ఉందని తెలిపారు. తమ పరిశీలనలో పరిమితికి మించి ఏవీ కనిపించలేదని, వైరస్‌ కాని, బాక్టీరియా కాని కనిపించలేదని సీసీఎంబీ తెలిపింది. సీరెం, యూరిన్‌ తదితర శాంపిళ్లు తీసుకుని పరిశీలన చేశామని, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, పుణె తెలిపింది. టమాటాలు, వంకాయలపై పురుగుమందుల అవశేషాలు కనిపించాయని ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌ తెలిపింది. పురుగు మందుల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని నివేదించింది. ఫెస్టిసైడ్స్‌ ఎలా మనుషుల శరీరంలోకి చేరాయన్న దానిపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మంగళగిరి ఎయిమ్స్ నిపుణులు తెలిపారు.

  • లోతైన అధ్యయనం అవసరం

మరింత లోతుగా పరీక్షలు చేయాలని నిపుణులను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ విషయాన్ని కొట్టి పారేయకుండా వీలైనంత మేర పరీక్షలు చేయించాలని, అప్పుడే ఏలూరు లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడగలమన్నారు. డంపింగ్‌ యార్డులు నిర్వహణపైనా దృష్టి పెట్టాలని, తాగు నీటి వనరులన్నింటినీ అన్ని జిల్లాల్లో పరిశీలన చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం శాంపిల్స్‌ తీసుకుని, వాటిని నిపుణులచేత విశ్లేషణ చేయించాలన్నారు. వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఓ కార్యాచరణ తయారు చేయాలని చీఫ్‌ సెక్రటరీకి సీఎం ఆదేశించారు.

  • సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి : సీఎం జగన్

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గాలను ఖరారు చేయాలని సీఎం నిర్దేశించారు. ఏలూరు అంశాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. ప్రతి జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్‌లు పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా శాంపిళ్లను స్వీకరించి పరీక్షలు చేసి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మూడు ప్రాంతాల్లో మూడు రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. అందుకోసం ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను పూర్తిగా మార్కెట్‌ నుంచి తొలగించాలన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి : విశాఖ 'విక్టరీ ఎట్ సీ' వద్ద అమర జవాన్లకు నివాళులు

Last Updated : Dec 16, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.