.
సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆ నలుగురు..!
జగన్ పోలవరం పర్యటన సమయంలో... పైడిపాక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు... కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని నిలువరించారు. జగన్ వారిని చూసి దగ్గరకు పిలిపించుకున్నారు. సమస్య అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితుల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని వారు ముఖ్యమంత్రికి విన్నవించారు. సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ముత్యాలరాజును సీఎం ఆదేశించారు.
cm
.