Sunita Williams Birthday: మూడోసారి రోదరిలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందినవారు. 8 రోజులపాటు మిషన్‌లో భాగంగా తన తోటి వోమగామి విల్మోర్తో కలిసి ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)కు వెళ్లిన ఆమె గత కొన్ని రోజులుగా స్పేస్‌లో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 19న ఆమె పుట్టినరోజు కాగా.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రంలోనే బర్త్ డే వేడుకలు నిర్వహించుకున్నారు.
బర్త్ డే ఎలా జరుపుకొన్నారంటే?: చాలా మంది తమ పుట్టిన రోజు వేడుకలను కేక్, కొవ్వొత్తులతో జరుపుకొంటారు. అయితే సునీతా విలియమ్స్ మాత్రం తన 59వ బర్త్ డే ఐఎస్ఎస్లోని ట్రాంక్విలిటీ మాడ్యూల్‌లోని వ్యర్థాలు, పరిశుభ్రత కంపార్ట్‌మెంట్ ఫిల్టర్‌లను భర్తీ చేయడం ద్వారా జరుపుకొన్నారు. సాధారణ భాషలో దీనిని బాత్రూమ్ ఆఫ్ స్పేస్‌గా పిలుస్తారు. సెప్టెంబర్ 19న ఆమె బిజీ షెడ్యూల్‌తో కొన్ని ముఖ్యమైన పనులతో గడిపారు. తన తోటి నాసా వ్యోమగామి విల్మోర్తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను నిర్వహించడంపై కూడా ఆమె దృష్టి సారించారు.
నిర్వహణ పనులతో పాటు విలియమ్స్ వ్యోమగాములు బారీ విల్మోర్, ఫ్రాంక్ రూబియోలతో కలిసి హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఫ్లైట్ డైరెక్టర్‌లతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా వ్యోమగాముల లక్ష్యాలు, చేయాల్సిన పనులు, వివిధ శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడారు. కాగా స్పేస్‌లో బర్త్‌డే చేసుకోవడం ఆమెకు ఇది రెండోసారి. గతంలో 2012లోనూ విలియమ్స్ తన పుట్టినరోజున మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు.
విలియమ్స్ స్పేస్ యాత్ర ఎప్పుడు ప్రారంభించారు?: సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965న యూక్లిడ్ ఒహియోలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా. ఆమె 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చేశారు. విలియమ్స్ మొదటిసారిగా 9 డిసెంబర్ 2006న స్పేస్‌కు వెళ్లి 22 జూన్ 2007లో తిరిగి వచ్చారు. ఆమె ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ మిషన్ సమయంలో ఆమె 4 సార్లు స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. విలియమ్స్ అంతరిక్ష నౌక వెలుపల మొత్తం 29 గంటల 17 నిమిషాలు గడిపారు.
ఆ తర్వాత రెండో మిషన్ 14 జూలై 2012న ప్రారంభమవ్వగా 18 నవంబర్ 2012 వరకు కొనసాగింది. ప్రస్తుతం మూడోసారి రోదరిలోకి వెళ్లిన ఆమె బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో పాటు ఐఎస్ఎస్లో చిక్కుకున్నారు. వీరిద్దరూ ఫిబ్రవరి 2025 నాటికి భూమిపైకి తిరిగి వచ్చేందుకు సాధ్యమవుతుంది.
'లవ్'.. ఈ పేరు వినగానే మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసా? - Scientists FOUND How Love Lights Up