ETV Bharat / state

టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణ నివేదికపై సీఎం సమీక్ష - Tirumala Laddu Issue

CM Chandrababu Review on Tirumala Laddu Issue in AP : తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు పాల్గొన్నారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు.

TIRUMALA LADDU ISSUE
TIRUMALA LADDU ISSUE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2024, 12:51 PM IST

Updated : Sep 22, 2024, 1:20 PM IST

CM Chandrababu Review on Tirumala Laddu Issue in AP : తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయంపై మంత్రులు, ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను అందించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

శ్రీవారి లడ్డూ లెక్కలు మారిపోయాయ్! - నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - SRIVARI LADDU QUALITY

అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ : తిరుమలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరిన్ని సంప్రదింపులు జరిగాకే సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లోనైనా కచ్చితంగా అదే వర్గానికి చెందిన సిబ్బంది ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

టీటీడీ అత్యవసర సమావేశం : కల్తీ నెయ్యి ఘటన వెలుగులోకి రావడంతో టీటీడీ ఈవో శ్యామలరావు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొలిక్కిరాని నిర్ణయం: అయితే తిరుమల లడ్డూ అపచారం పరిష్కృతిపై ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అపచార పరిహారం చేసేందుకు ఆగమ కమిటీ పలు సూచనలు చేసింది. చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణలపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. భక్తుల దర్శనాలతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో నిర్ణయంపై ఆలస్యం అవుతోందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నేడు సీఎం చంద్రబాబుకు సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలతో నివేదిక ఇవ్వడంతో తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.

నెయ్యి సేకరణ విధానాలు, టెండర్ నిబంధనలు మార్చాల్సిందే- తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ - TTD Report to Laddu Issue

రాష్ట్రవ్యాప్తంగా తిరుమలలో కల్తీ నెయ్యిపై ఆగ్రహావేశాలు - భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు - Tirumala Laddu Issue in AP

Last Updated : Sep 22, 2024, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.