అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు జననానికి సంబంధించి వాక్యలు చదివి వినిపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పోతునూరు ఆర్సీఎం చర్చి ఫాదర్ డేవిడ్ రాజు వాక్యోపదేశం చేస్తూ క్రీస్తు జననం లోకంలోని పాపాలు తొలగించడానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరు జీవించడానికి పుడతారని ఏసుక్రీస్తు మాత్రం పాపులను రక్షించి మరణించడానికి పుట్టారని కొనియాడారు. డప్పు వాయిద్యాలు టపాసులతో యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి...