ETV Bharat / state

గర్భం దాల్చిన మైనర్.. రాత్రికి రాత్రి బాలుడుతో వివాహం! - పశ్చిమగోదావరి జిల్లాలో బాల్యవివాహం తాజా వార్తలు

ద్వారకాతిరుమల మండల పరిధిలో.. బాల్యవివాహం కలకలం సృష్టించింది. గ్రామ పెద్దలు సోమవారం బాల్య వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విచారణ చేయగా.. అంతకు ముందు రోజు రాత్రి మరో ఇద్దరు మైనర్లకు వివాహం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

గర్భం దాల్చిన మైనర్.. రాత్రికి రాత్రి బాలుడుతో వివాహం!

author img

By

Published : Sep 28, 2020, 11:55 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పరిధిలో.. బాల్య వివాహాలు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు, మైనర్ బాలికలు ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా వచ్చింది. ఆదివారం రాత్రి ఒక బాలిక, బాలుడుకు పెళ్లిజరిపించారు గ్రామ పెద్దలు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో.. ఆ మైనర్ బాలిక గర్బందాల్చింది. ఫలితంగా.. వారికి రాత్రికి రాత్రి పెళ్లి జరిపించారు.

అయితే.. మరో మైనర్ బాలుడికి, మైనర్ బాలికకు ఈ రోజు ఉదయం వివాహం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం రావడంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు పెళ్లిని అడ్డుకున్నారు. రెండు సంఘటనల్లోనూ మైనర్ బాలురిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం. అయితే నలుగురు మైనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

రైతులకు ఉచితంగా బోర్లు.. ఖర్చంతా ప్రభుత్వానిదే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.