CBN FIRES ON CM JAGAN : మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటాల్సిన సమయం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహిళల్ని ఎవరు పైకి తెచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని సూచించారు. డ్వాక్రా సంఘాల స్వయం సాధికారతని సీఎం జగన్ దెబ్బతీశాడని మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతుంటే.. అమలు గడప దాటట్లేదని విమర్శించారు. ఇచ్చే డబ్బుకు.. దోచుకునే దానికి పొంతన లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లా.. మీరూ ఇంటికి ఉత్తమ ఆర్థిక మంత్రులని మహిళలను కొనియాడారు.
"డ్వాక్రా సంఘాల స్వయం సాధికారితను సీఎం జగన్ దెబ్బతీశారు. సీఎం మాటలు కోటలు దాటుతుంటే.. అమలు గడప దాటట్లేదు. ఇచ్చే డబ్బుకు.. దోచుకునే దానికి పొంతన లేదు. మహిళల్ని ఎవరు పైకి తెచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోండి. మీటింగ్‌ల కోసమే డ్వాక్రా సంఘాలను జగన్ ఉపయోగిస్తున్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తాం"-చంద్రబాబు
4 ఏళ్లలో ఖర్చులు పెరిగి కొనుగోలు శక్తి తగ్గిందో లేదో ఆలోచించాలన్నారు. మీటింగ్‌ల కోసమే డ్వాక్రా సంఘాలను జగన్ ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశామని గుర్తుచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల్ని ఆదుకుంటూ వారికి గౌరవం కల్పించిన పార్టీ తెలుగుదేశమన్నారు.
కార్యకర్త కోసం నేలపై కూర్చున్న చంద్రబాబు: పార్టీ కార్యకర్త కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నేలపై కూర్చున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరులో తాళ్లపూడికి చెందిన దివ్యాంగ కార్యకర్త శ్రీనివాస్.. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పక్కనే చంద్రబాబు కింద కూర్చొని అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలియోతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని శ్రీనివాస్ ఆయనకు తెలిపారు. చాలాకాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నారని పక్కనే ఉన్న ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. పార్టీ తరఫున శ్రీనివాస్‌కు ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: