ETV Bharat / state

ACCIDENT: చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు.. - crime news

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Oct 9, 2021, 10:32 AM IST

Updated : Oct 9, 2021, 1:29 PM IST

10:29 October 09

bus accident in west godavari

 అప్పటి వరకూ సాఫీగా సాగిన బస్సు ప్రయాణంలో భారీ కుదుపు! ఆ క్షణం వరకూ నవ్వుతూ.. తుళ్లుతూ ఉన్న విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. పిల్లలతో ప్రయాణిస్తున్న ప్రైవేటు పాఠశాల బస్సు.. ఒక్కసారిగా అదుపు తప్పి చెెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం బోగోలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బస్సు ప్రయాణిస్తుండగానే స్టీరింగ్‌ ఫెయిల్ కావడంతో.. ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విద్యార్థులెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. దసరా సెలవుల్లోనూ సదరు పాఠశాల యాజమాన్యం తరగతులు నిర్వహిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

ఇదీ చదవండి: 

Gayatri Avataram: గాయత్రీ దేవి అలంకారంలో దానేశ్వరి అమ్మవారు

Last Updated : Oct 9, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.