ETV Bharat / state

పల్లెల్లోనూ బిర్యానీ విక్రయాలు - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

ఈ లోకం మొత్తం వండివార్చడానికి వేదిక.. రుచి చూడటానికి ఇంతకు మించిన సమయం లేదిక.. జిల్లాలో పట్టణాలు.. పల్లెలనే తేడా లేకుండా ఊరూరా బిర్యానీ ఘుమఘుమలు విస్తరిస్తున్నాయి. రోజూ కాకపోయినా జిహ్వచాపల్యం ఊరిస్తున్నప్పుడు బిర్యానీ ఆరగించాల్సిందేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దీంతో పదుల సంఖ్యలో ఉండే ఈ దుకాణాలు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి.

Biryani sales in every village
పల్లెల్లోనూ బిర్యానీ విక్రయాలు
author img

By

Published : Jan 10, 2021, 5:44 PM IST

ఈ లోకం మొత్తం వండివార్చడానికి వేదిక.. రుచి చూడటానికి ఇంతకు మించిన సమయం లేదిక.. జిల్లాలో పట్టణాలు.. పల్లెలనే తేడా లేకుండా ఊరూరా బిర్యానీ ఘుమఘుమలు విస్తరిస్తున్నాయి. రోజూ కాకపోయినా జిహ్వచాపల్యం ఊరిస్తున్నప్పుడు బిర్యానీ ఆరగించాల్సిందేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దీంతో పదుల సంఖ్యలో ఉండే ఈ దుకాణాలు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. ఒకప్పుడు బిర్యానీ తినాలంటే సమీప పట్టణాల బాట పట్టేవారంతా ఎక్కడికక్కడే వెలుస్తున్న దుకాణాలతో స్థానికంగానే రుచి చూస్తున్నారు. ఫలితంగా విక్రయాలు పెరిగాయి. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది.

ఆదివారం మరింత ప్రత్యేకం

‘ఈ రోజు ఆదివారం. సాయంత్రం నేను వంట చేసేది లేదు. పిల్లలకు మనకూ ధమ్‌బిర్యానీ కానీ ప్రత్యేక ఫ్రైడ్‌ రైస్‌ కానీ తీసుకురావాల్సిందేనని ఒకింట్లో శ్రీమతి తన శ్రీవారికి ఆదేశాలు జారీ చేశారు. అడగక అడిగిన ఇల్లాలి మాటను కాదనే వారెెవరుంటారు. పైగా వారంలో ఒక్కపూట ఆమెకు కొంత విశ్రాంతినిచ్చే అవకాశం. అందువల్ల చాలామంది కనీసం వారానికో పూట ప్రత్యేకంగా బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారని పాలకొల్లుకు చెందిన వాసు తెలిపారు. ప్రస్తుతం దుకాణాల సంఖ్య పెరగడంతో ఎప్పుడంటే అప్పుడు అందుబాటులోకి వచ్చేస్తోందని నరసాపురం మండలం దర్భరేవుకు చెందిన దుక్కిపాటి వాసు అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది ఆదివారం మాంసాహారం తినడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆరోజు సాధారణ రోజుల కంటే ఎక్కువ మోతాదులో బిర్యానీ తయారుచేసి విక్రయిస్తున్నట్లు చించినాడకు చెందిన రెస్టారెంట్‌ యజమాని స్టాలిన్‌ తెలిపారు.

దారి పొడవునా అవే..

పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కోడి పకోడి దుకాణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధాన రహదారుల నుంచి పల్లె దారుల వరకు ప్రశాంతంగా ఉండే జాగా కనిపిస్తే చాలు అక్కడో పకోడి దుకాణం వెలుస్తోంది. భీమవరం మొదలుకొని చించినాడ వశిష్ఠ గోదావరి వంతెన వరకు సుమారు 34 కిలోమీటర్ల మేర విస్తరించిన జాతీయ రహదారిలో దాదాపు 50 వరకు ఇలాంటి దుకాణాలు ఉన్నాయంటే అతిశయోక్తి లేదు.

యలమంచిలి మండలం చించినాడలో ఒక పూట ముందుగానే ఆర్డర్‌ ఇస్తే కానీ సాయంత్రానికి పకోడి చేతికి రాని దుకాణాలున్నాయంటే నమ్మక తప్పదు. కోడి పకోడికి ఉన్న అభిమానులు ఆ స్థాయిలో పెరిగారు.

పెరిగిన అమ్మకాలు

యలమంచిలిలో గతంలో బిర్యానీ తినాలంటే సమీపంలోని కాజ ధమ్‌బిర్యానీ లేకపోతే పాలకొల్లు వెళ్లేవారు. కొవిడ్‌ వ్యాప్తి నెమ్మదించాక స్థానికంగానే మూడు దుకాణాలు వెలిశాయి. ఇవిగాక డిసెంబరు 31, జనవరి 1, సంక్రాంతి పండగల నేపథ్యంలో 10 వరకు ప్రత్యేక దుకాణాలు వెలుస్తున్నాయి. ఇందుకు సరకులు తీసుకునేవారు గతంలో ఎక్కువగా చిన్న పొట్లాలు కొనేవారు. హోల్‌సేల్‌ విక్రయదారులు కూడా అందుకు అనుగుణంగా చిన్నపొట్లాలు, బాగా పెద్ద దుకాణాలకైతే కిలో వరకు మసాలాలు విక్రయించేవారు. దుకాణాల సంఖ్య పెరగడంతో పాలకొల్లులోని హోల్‌సేల్‌ దుకాణాల నుంచి నిత్యం పది కిలోలకు పైగా విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారి సుబ్బారావు చెప్పారు.

పట్టణాలతో పోటాపోటీగా..

ఒక్కప్పుడు పట్టణాలకే పరిమితమైన బిర్యానీ పాయింట్లు ఇప్పుడు పల్లెలకూ వ్యాపించాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలవరం వంటి ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో బిర్యానీ దుకాణాలు వెలిశాయి. వీటిలో ఇప్పటికీ 25 శాతానికిపైగా కొనసాగుతున్నాయి. ప్రతి సందర్భాన్ని పండగలా చేసుకోవాలని.. ఆ సమయంలో ఆసక్తి గల ఆహారాన్ని తినాలనుకునే ధోరణి పెరగడంతో ఇలా బిర్యానీ దుకాణాలు అన్ని ప్రాంతాల్లోనూ వెలుస్తున్నాయి. భీమవరం పట్టణ పరిధిలో పెద్దవి 50 వరకు ఉండగా, రోడ్డు పక్కన విక్రయాలు చేసేవారు 150 మంది వరకు ఉంటారు. తాడేపల్లిగూడెంలో గతంలో 150 దుకాణాలుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 200కు పైగా చేరుకుంది.

ప్రత్యేకతలోనూ ..

పోటీ ప్రపంచంలో నిలబడటానికి బిర్యానీ దుకాణాలవారు, చికెన్‌ పకోడి విక్రయదారులు ప్రత్యేకతను చాటుకోవడానికి యత్నిస్తున్నారు. చికెన్‌ పకోడి దుకాణాల్లో పొయ్యిపై ఉన్న మూకుడు.. దానిలో నూనెను పరిశీలించి కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉంటారు. దీనిని అనుసరించి ఏ రోజుకారోజు తాజా నూనె పోసి పకోడి వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పకోడిలోకి జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వంటివి దట్టించి ఆకట్టుకుంటున్నారు. దుకాణాల్లో బిర్యానీకి ఉలవచారు, కోడికూర వంటివి అదనంగా అందించి విక్రయాల్లో పోటీపడుతున్నారు.

భీమవరంలో ఎన్నెన్నో రుచులు

భీమవరంలో ఎన్నెన్నో రుచులు చవులూరిస్తున్నాయి. చేప, రొయ్య, పీత, నాటుకోడి, సముద్రపు చేపల్లోని రకాలతో వండి వడ్డిస్తున్నారు. మిక్స్‌డ్‌ బిర్యానీ పుట్టిందే భీమవరంలో.. మటన్‌, చికెన్‌, రొయ్య, గుడ్డుతో పాటు మసాలా దట్టించి వడ్డిస్తే భోజనప్రియులు లోట్టలేసుకుని మరీ తింటున్నారు. అందుకే నిత్యం 2 టన్నుల బియ్యాన్ని బిర్యానీ వంటకాలకే ఉపయోగిస్తున్నారని అంచనా. కరోనా నేపథ్యంలో కొన్ని నెలల పాటు హోటళ్లు మూతపడినా ప్రస్తుతం రాత్రి పొద్దుపోయే వరకు విక్రయాల జోరు కొనసాగుతోంది. బిర్యానీ, ముంత బిర్యానీ, చికెన్‌, మటన్‌, రొయ్య బిర్యానీతో పాటు ఎగ్‌ఫ్రైడ్‌, చికెన్‌ ఫ్రైడ్‌రైస్‌లు ఇక్కడి ప్రత్యేకతలు.

ఇదీ చదవండి: తండ్రీకుమార్తెల ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.