పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన యోగా శిక్షకురాలు పద్మజ తెలిపారు. ధ్యానంలో భాగంగా చుట్టూ ఉన్న ప్రాణులు సంతోషంగా జీవించాలని కోరుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని పద్మజ తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు.
ఇది చూడండి; ధ్యానం ముగించిన ప్రధాని మోదీ...