పశ్చిమగోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలపై అధికారులు విచారణ చేపట్టారు. జాతరలో విధులు నిర్వర్తించిన ఏలూరు గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సురేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ విచారణలో తేలడంతో.. వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.
రెండు రోజుల క్రితం ఏలూరు మండలం పోణంగిలో జాతర నిర్వహించారు. ఈ జాతరలో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. దీనిపై పోలీసు ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఇదీ చదవండి: