పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చోడవరం గ్రామ సచివాలయంపై ఉన్న ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చించారనే నెపంతో బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలను న్యాయస్థానంలో హాజరుపరచకుండా గత నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారని.. సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగమా అని నిలదీశారు.
జగన్ చిత్రపటం చించితే ఇంత హడావుడి చేస్తున్న పోలీసులు తెదేపా కార్యకర్తలపై భౌతిక దాడులు చేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలను వదిలిపెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వారికి ఏం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని అన్నారు.
మహిళల రక్షణ మిథ్యే: బుద్ధా వెంకన్న
సొంత చెల్లికే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిథ్యేనని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డి అనూషని దారుణంగా హత్య చేస్తే.. లేని దిశ చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశించడం రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
-
సొంత చెల్లెళ్లకే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిథ్యే.(1/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) February 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సొంత చెల్లెళ్లకే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిథ్యే.(1/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) February 25, 2021సొంత చెల్లెళ్లకే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిథ్యే.(1/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) February 25, 2021
ఇదీ చదవండి: