రాష్ట్రవ్యాప్తంగా కరోనా విపత్తు సమయంలో ఏడు విడతలుగా ఉచిత రేషన్ పంపిణీ చేశారు. ప్రస్తుతం 8వ విడత రేషన్ పంపిణీ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు విడతల్లో పంపిణీ చేసిన సరకుల్లో రెండు విడతల పంపిణీ చేసిన బియ్యానికి మాత్రమే ప్రభుత్వం కమీషన్ చెల్లించిందని రేషన్ డీలర్లు తెలిపారు.
జిల్లాలోని ప్రతి రేషన్ డీలరుకు ప్రభుత్వం కమీషన్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. కమీషన్లు చెల్లించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కష్ట కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన తమకు రావలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
ఇదీ చదవండి నరసన్నపాలెం వద్ద పట్టుబడిన గంజాయి లారీ