ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు @7am - ఏపీ ప్రధాన వార్తలు

..

7am topnews
ప్రధానవార్తలు @7am
author img

By

Published : Nov 28, 2022, 7:01 AM IST

  • ఉగ్రవాద పార్టీకి సజ్జల సలహాదారు: పవన్​ కల్యాణ్​
    అన్నమయ్య డ్యామ్​ కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేసిన పవన్​.. చెట్లు నరికేవాళ్లు గరుడ పురాణం చదవాలన్నారు. 200 మంది ప్రాణాలను కాపాడిన లష్కర్​ రామయ్యను అభినందించి.. రూ.21 లక్షలు ఆర్థిక సాయం చేశారు. రాయలసీమకు చెడ్డపేరు తెస్తున్న సజ్జల.. ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పవన్​పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు... ఏమన్నారంటే..!
    వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షూటింగ్‌ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్‌ మీటింగ్‌లు పెడితే ప్రజలు నమ్మరని పవన్‌ గ్రహించాలని.. రోజా సూచించారు. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాప్తాడు రాజకీయం.. దాడికి గురైన జగ్గుపైనే నాన్ బెయిలబుల్ కేసు
    సత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరులు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగ్గుపై దాడి చేసిన వైకాపా నాయకులపై బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు.. దాడికి గురైన జగ్గుపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు జగ్గును డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
    అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు అతి వేగంతో ప్రయాణిస్తూ కారు ద్విచక్ర వాహనంతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న మరో ఇద్దరిపై దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వందేళ్ల నాటి 110 మీటర్ల పొడవైన చిమ్నీ కూల్చివేత
    ఝార్ఖండ్‌ జంషెడ్‌పుర్‌లోని టాటా స్టీల్‌ ప్లాంట్‌లో 110 మీటర్ల పొడవైన చిమ్నీని కూల్చివేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ సహకారంతో కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు టాటా స్టీల్‌ ప్లాంటు వర్గాలు తెలిపాయి. 11 సెకన్లలో కూల్చివేత పూర్తయినట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 187 నాణెలను మింగిన వ్యక్తి!
    ఎక్కడైనా సరే చిన్నపిల్లలు పొరపాటున ఒకటి లేదా రెండు నాణెలను మింగారన్న వార్తలను విని ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా 187 నాణెలను మింగాడు. వైద్య చరిత్రలోనే ఇది చాలా అరుదైన కేసు అని అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జిన్​పింగ్​కు బిగ్​ షాక్​ ఇస్తూ కొవిడ్ లాక్​డౌన్​ నిరసనలు తీవ్రం
    జీరో కొవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో ఆందోళనలు పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కమ్యూనిస్టు దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆంక్షల పరిధిని అధికారులు విస్తరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​ నుంచి రూ.లక్ష కోట్ల ఔషధ ఎగుమతులు.. గతేడాదితో పోలిస్తే..
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరులో దేశం నుంచి ఔషధ ఎగుమతులు భారీగా పెరిగాయి. గతేడాదిలో పోలిస్తే ఈ ఎగుమతులు 4.22 శాతం అధికమని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష!
    పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆయన కథ చెప్పినప్పుడు నవ్వాగలేదు: రవితేజ
    ప్రముఖ కథానాయకుడు రవితేజ.. హీరో విష్ణువిశాల్​తో కలిసి నిర్మించిన చిత్రం 'మట్టి కుస్తీ'. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ, విష్ణువిశాల్​ పంచుకున్న విషయాలు మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.