పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వీఆర్వో అడపా రాంబాబును అనిశా అధికారులు పట్టుకున్నారు. కొయ్యాలగూడెం విశ్రాంత ఆంధ్రాబ్యాంక్ మేనేజరు శ్రావణ్‌కుమార్‌కు పరింపూడిలో 30 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని వీఆర్వోను సంప్రదించారు. 60 వేలు ఖర్చు అవుతుందని చెప్పిన వీఆర్వో... నాలుగు నెలలుగా తిప్పుతున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రావణ్‌కుమార్... అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అనిశా అధికారులు... వల పన్ని రాంబాబును పట్టుకున్నారు. 30 వేలు ఇవ్వజూపి... లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకున్నారు.
రూ. 60 వేలు అడిగాడు... అనిశాకు చిక్కాడు - koyyalagudem
పాస్‌బుక్ కోసం 60 వేలు డిమాండ్ చేసి నాలుగు నెలలుగా తిప్పుకుంటున్న వీఆర్వో అవినీతి నిరోధక శాఖాధారులకు చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు... అనిశా సహయాన్ని తీసుకున్నారు.