ETV Bharat / state

హిజ్రా  రౌడీయిజం చేస్తోందని తోటి హిజ్రాల ఫిర్యాదు

author img

By

Published : Dec 25, 2020, 7:03 AM IST

అందంగా మేకప్ వేసుకుని, చప్పట్లు కొడుతూ రోజుకు ఎంతో కొంత సంపాదించుకునే హిజ్రాలను.. తోటి హిజ్రానే విలన్​గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె నుంచి తమను కాపాడాలంటూ భీమవరం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

A transgender committing rowdyism against fellow Hijras in Bhimavaram West Godavari district
తోటి హిజ్రాల పై రౌడీయిజానికి పాల్పడుతున్న ట్రాన్స్​జెండర్​

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో చెందిన ఓ హిజ్రాపై తోటి హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

భీమవరం దుర్గాపురానికి చెందిన పోరాపాటి శిల్ప వద్ద అదే ప్రాంతానికి చెందిన 30 మందికిపైగా హిజ్రాలు ఆశ్రయం పొందుతున్నారు. సంపాదించిన డబ్బంతా తీసుకుంటున్న ఆమె... పెట్టిందే తినాలంటూ దౌర్జన్యం చేస్తుందని తోటి హిజ్రాలు వాపోయారు. కన్నవారిని చూద్దామంటే... వెళ్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. అదేమని ప్రశ్నిస్తే రౌడీలతో కొట్టిస్తుందని తెలిపారు.

ఆమె నుంచి తమను కాపాడాలంటూ భీమవరం టూ టౌన్ పోలీసులను హిజ్రాలు ఆశ్రయించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: స్కూటీని ఢీ కొట్టిన లారీ... ఇద్దరు యువతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.