పెద్దపులి గాండ్రింపు వింటేనే గుండెలు అదిరిపోతాయి. పులి పంజాకు చిక్కి బతికిబట్టకట్టని దాఖలాలు లేవు..అభయారణ్యంలో మాత్రమే సంచరించే ఈ బెబ్బులి అడుగు జాడలు పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బయటపడ్డాయి. బుట్టయగూడెం మండలం కన్నాపురం అటవీరేంజ్ పరిధిలోని పేరంటాల కొండ వద్ద వాగుల్లోని ఇసుక మేటలపై పలుచోట్ల జంతువు పాదముద్రలను(a tiger wandering at Kannapuram forest range ) ఏజెన్సీ గ్రామాల ప్రజలు గుర్తించారు. పాదముద్రలను బట్టి చిరుతపులి లేదంటే.. పెద్దపులివి అయి ఉంటాయన్న అనుమానంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రల పరిమాణం బట్టి అవి పెద్దపులి పాదముద్రలుగా వన్యప్రాణి విభాగం అధికారులు ధ్రువీకరించారు. పాదముద్రలను సేకరించి.. నాలుగు రోజుల కిందట పరీక్షల కోసం పంపారు. అవి మగ పెద్దపులి పాదముద్రలుగా పరీక్షల్లో తేలింది.
తెలంగాణ అటవీప్రాంతం నుంచి పెద్దపులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆహారం, ఆడపులుల కోసం.. మగ పులులు వందల కిలోమీటర్లు సంచరిస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ పెద్దపులి సంచరించలేదని తెలిపారు. పెద్దపులి కదలికలు గుర్తించేందుకు అధికారులు... నీరున్న వాగుల సమీపంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు(trap cameras for tiger movements at water areas in Kannapuram forest ) చేశారు. ఏడాది కిందట కుక్కునూరు అటవీ ప్రాంతంలో పశువులపై గుర్తుతెలియని క్రూరమృగాలు దాడిచేశాయి. దాడి చేసింది పెద్దపులే అయి ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేసినా. అటవీశాఖ అధికారులు మాత్రం నిర్ధరించలేదు. ప్రస్తుతం పెద్దపులి సంచారం ఉంటున్నట్లు నిర్ధరణకు వచ్చిన అధికారులు... వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో సమీప అటవీప్రాంత ప్రజలు భయాందోళన(people shocked for tiger movements)కు గురవుతున్నారు.
ఇదీ చదవండి..