ETV Bharat / state

నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం... ఆలస్యంగా వెలుగులోకి!

author img

By

Published : Jan 30, 2021, 10:19 AM IST

లక్షలు విలువచేసే భూమికి వేలల్లో రుణాలు ఇవ్వడానికి రైతులను ముప్పుతిప్పలు పెడుతూ ఉంటారు బ్యాంకర్లు. అటువంటిది చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న భూమికి కోటి రూపాయలు రుణం ఇచ్చిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

land owner
అసలు భూయజమాని
భూయజమాని అరుణకుమారి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన లోవా వెంకటేశ్​ యాభై ఆరు ఎకరాల చేపల చెరువును లీజుకు తీసుకున్నట్లు నకిలీ అగ్రిమెంట్ సృష్టించాడు. దానిని ఆధారంగా చూపించి ఏలూరులోని సిండికేట్ బ్యాంకులో 2015లో కోటి రూపాయల పైగా రుణాన్ని పొందాడు. అసలు భూయజమాని క్రాప్​ లోను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లగా అప్పటికే ఆ భూమిపై లోన్​ తీసుకున్నారని చెప్పారు.

విషయం వెలుగులోకి ఇలా...

భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన ఆరేటి జగన్మోహన్​రావు సింగరేణి కోల్​మైన్ లో ఉద్యోగిగా పని చేసి 2012లో మృతి చెందాడు. అతని పేరు మీద ఉన్న భూమిని ఆయన భార్య అరుణ పేరు మీదకు మార్పించుకున్నారు. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కూడా అధికారులు ఇచ్చారు. గత ఏడాది జూన్​లో వ్యవసాయ రుణం కోసం ఆంధ్రా బ్యాంకు అధికారులను సంప్రదించగా.. ఇప్పటికే మీరు సిండికేట్ బ్యాంకులో కోటి రూపాయలు రుణం పొంది ఉన్నారని చెప్పడంతో అరుణ కుమారి విస్తుపోయారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఏలూరులోని సిండికేట్ బ్యాంక్ అధికారులను సంప్రదించారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 28న బ్యాంకు ఆవరణలో ఆందోళన చేశారు.

స్పందించిన బ్యాంకు అధికారులు.. రుణం పొందిన వ్యక్తి ఇచ్చిన లీజ్ అగ్రిమెంట్ కాపీ, జగన్మోహన్​రావు నకిలీ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో రుణం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బ్యాంకు అధికారులు తప్పును సరి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అరుణ కుమారి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నకిలీ రుణాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఫార్మసీ కళాశాలలో అక్రమాలు... పోలీసుల అదుపులో ప్రిన్సిపల్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.