పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చింతకాయల కొత్తగూడెం గ్రామానికి చెందిన మాతంగి నవీన్ (21) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.
ఇవీ చదవండి