పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం అప్పన చెరువు గ్రామానికి చెందిన కల్యాణ్... తన కూతురు అల్లరి చేస్తోందని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. నచ్చజెప్పి తప్పును వివరించాల్సిన ఆ తండ్రి.. తనలోని దుర్మార్గుడిని బయటకు తెస్తూ.. ఆ చిన్నారి ముఖం, శరీరంపై వాతలు పెట్టాడు. కర్రను కాల్చి.. ముఖం, చేతులు, వేళ్లు, తలపై కాల్చాడు. ఆరేళ్ల వయసున్న ఆ పాప భరించలేని బాధతో కేకలు వేస్తున్నా అతను పట్టించుకోలేదు.
విషయం తెలిసిన చిన్నారి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లి ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా.. ముగ్గురు ఆమె పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు.
ఇదీ చూడండి: