లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలను పంపిణీ చేస్తోంది. మొదట బియ్యం కార్డు ఉన్నవారికే వీటిని అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం...తాజాగా ఈ నిబంధనను పక్కన పెట్టింది. కార్డు లేకున్నా ఈ నెలలో రేషన్ తీసుకున్న వారందరికీ వెయ్యి రూపాయల సాయం అందించాలని సీఎం జగన్ శనివారం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో పశ్చిమగోదావరి జిల్లాలో 28,528 మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం 11,73,400 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో 11,44, 872 మందికి మాత్రమే బియ్యం కార్డులు ఉన్నాయి. తాజా నిర్ణయంతో మిగిలిన 28,528 మంది పేదలకు ఆర్థిక సాయం అందనుంది. రేషన్ కార్డు ఉండి బియ్యం కార్డు లేని వారి వివరాలను పౌరసరఫరాల శాఖ నుంచి రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!