ETV Bharat / state

Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అనుమానం రాకుండా.. - విజయవనగరం జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Wife killed her husband: ఆమెకు పెళ్లైంది... ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు... అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది... తప్పని చెప్పిన భర్తనే తప్పించాలని పథకం వేసింది... ప్రియుడితో కలిసి తాళి కట్టిన భర్తనే కడతేర్చింది... అనుమానం రాకుండా మృతదేహాన్ని పట్టాలపై పడేసింది... ఈ దారుణం విజయనగరం జిల్లాలో జరిగింది.

Wife killed her husband
భర్తను చంపిన భార్య
author img

By

Published : May 2, 2022, 9:44 AM IST

Wife killed her husband: పిల్లలకు ఎదిగే వయసొచ్చిందని.. ప్రియుడితో తిరగడం ఆపాలని భర్త పదేపదే చెప్పడంతో భార్య వైరం పెంచుకొంది. కొందరితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయగా.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. హత్యగా నిర్ధారించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో చోటు చేసుకుంది.

మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్‌ మిమ్స్‌లో క్లర్కుగా పని చేస్తున్నారు. ఆయనకు 16 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెంకటాపురానికి చెందిన అరుణ జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరంతా నెల్లిమర్ల మండలంలోని గొల్లవీధికి చెందిన కె.రాంబాబు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో రాంబాబు, అరుణ జ్యోతి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత చంద్రశేఖర్‌ భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం తరచూ రాంబాబు ఇంటికి రావడాన్ని గమనించిన చంద్రశేఖర్‌ ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె.. శ్రీకాకుళంలో ఉన్న తల్లి సత్యవతి సహకారం కోరింది. ఆమె రూ.20 వేలు ఇవ్వగా, ప్రియుడు మరో రూ.20 వేలు సమకూర్చాడు. ఈ సొమ్ము తీసుకొని తన భర్తను చంపాలని నెల్లిమర్ల మండలంలోని ఎర్రంశెట్టి సతీష్‌ను పురమాయించింది.

అనుమానం రాకుండా: ఈ నెల 24న రాత్రి మాట్లాడాలని ఉందని చంద్రశేఖర్‌ను రాంబాబు బయటకు తీసుకువెళ్లాడు. వీరు మాట్లాడుతుండగా చంద్రశేఖర్‌ తలపై వెనుక నుంచి వచ్చిన సతీష్‌ రాడ్డుతో కొట్టాడు. తీవ్రగాయమవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనుమానం రాకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. అరుణ జ్యోతి మీద అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకున్నారు. ఆమెతో పాటు తల్లి సత్యవతి, రాంబాబు, సతీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మంగవేణి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐలు పి.నారాయణరావు, కిరణ్‌కుమార్‌ నాయుడు, నసీమా బేగమ్‌ తదితరులను ఆమె అభినందించారు.

ఇదీ చదవండి: విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.