క్షణికావేశంలో ఆ భార్య చేసిన పని వల్ల ఇద్దరు చిన్నారులు తల్లిలేని బిడ్డలుగా మారారు. విజయనగరం రజిల్లా పూసపాటిరేగ మండలం చిన్ననడిపల్లికి చెందిన మహాలక్ష్మి, నూకరాజు భార్యాభర్తలు. ఇద్దరు స్థానిక పరిశ్రమలో రోజుకూలీలుగా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరు గొడవ పడటంతో.. మహాలక్ష్మి రాత్రి భోజనం చేయలేదు. దీంతో ఇదే విషయంపై నూకరాజు ఆమెను మందలించగా.. గొడవ మరింత పెద్దదయ్యింది. క్షణికావేశంలో మహాలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే నూకరాజు, స్థానికుల సహాయంతో మహాలక్ష్మిని సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యలు నిర్థరించటంతో.. ఇది తట్టుకోలేని నూకరాజు ఇంటికి వచ్చి, అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు నూకరాజును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరికి 11 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి కారు ప్రమాదం.. భార్య, బిడ్డలను కాపాడలేని దైన్యం..!