విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అత్యాచారానికి గురైన మూడేళ్ల బాలికను.. విజయనగరం తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, నియోజకవర్గ ఇంఛార్జ్ అదితి గజపతిరాజు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తల్లిదండ్రులను కలిసి.. ఘటనపై ఆరా తీశారు. ఆడుకుందామని చెప్పి చిన్నారిని తీసుకుపోయి.. అత్యాచారానికి ఒడిగట్టడంపై విచారం వ్యక్తం చేశారు.
మైనర్లు అత్యాచారానికి పాల్పడటం, చిన్నవయస్సులో వారికి దురాలోచనలు రావడాన్ని.. దుర్మార్గమైన చర్యగా తెదేపా నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇలాంటి సంఘటనలు జరగడ విచారకరమన్నారు. చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయటంలో పాలకులకు చిత్తశుద్ధి లేకనే.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయన్నారు.
ఇదీ చదవండి: